ప్రభాస్ గురించి ఒక్కమాటలో తేల్చి చెప్పేసిన శృతి హాసన్

ప్రభాస్ గురించి ఒక్కమాటలో తేల్చి చెప్పేసిన శృతి హాసన్

Published on Jun 29, 2022 11:00 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వాటితో మంచి సక్సెస్ లు అందుకుంటూ కొనసాగుతున్నారు శృతి హాసన్. ఇక లేటెస్ట్ గా ఆమె డార్లింగ్ ప్రభాస్ తో కలిసి సలార్, మెగాస్టార్ చిరంజీవి 154 మూవీ, అలానే బాలయ్య తో 107 వ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు క్రేజీ ప్రాజక్ట్స్ తో ఎంతో బిజీగా గడుపుతున్న శృతి ప్రస్తుతం ప్రబాస్ సలార్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండడంతో మధ్యలో మొన్న ఒక ఆంగ్ల పత్రికతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

తనకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ కూడా ఒకరని ఆయన సినిమాల్లోని కథ, కథనాలు ఎంతో బాగుంటాయని అన్నారు శృతి. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న సలార్ లో తాను చేస్తున్న ఆద్య పాత్ర గురించి ఇప్పుడే ఏమీ రివీల్ చేయలేనని చెప్పిన శృతి, హీరో ప్రభాస్ తో వర్క్ చేయడం నిజంగా ఎంతో బాగుందని, ముఖ్యంగా ఆయన గురించి ఒక్కమాటలో చెప్పాలి అంటే ఆయన ఒక అద్భుతం అని అన్నారు. కాగా త్వరలో సలార్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కానుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు