“గంధర్వ” లో 50 మంది ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్

Published on Oct 25, 2021 2:00 pm IST


వంగవీటి, జార్జిరెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం గంధర్వ. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఎం.ఎన్‌.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని ఒక పాయింట్ తో రూపొందుతున్న ఈ చిత్రం తో అప్సర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్, బాబు మోహన్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ లకు మంచి స్పందన లభించడమే కాకుండా సినిమా పై అంచనాలు పెంచేలా చేశాయి.

ఇండియ‌న్ సినిమాల్లో ఇప్పటివరకు రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ఈ చిత్రం రూపొందుతుండగా, ఇప్ప‌టి వరకు చేయని ఓ వైవిధ్యమైన రోల్‌లో హీరో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని ఇది వరకే చిత్ర బృందం వెల్లడించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఇటీవల షూటింగ్ జరిగిన ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు ముఖ్యనటులు సాయి కుమార్, సురేష్ లతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ఫైట్ సీన్ లో పాల్గొన్న ఫైటర్స్ కు హీరో సందీప్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు వారికి వెండి నాణాలను బహుకరించి అభినందించారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఈ సినిమా కోసం పనిచేసిన వారంతా ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు. సందీప్ మాధ‌వ్‌, గాయ‌త్రి ఆర్‌.సురేశ్‌, శీత‌ల్ భ‌ట్‌, సాయికుమార్‌, సురేష్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం అప్స‌ర్ వహిస్తున్నారు. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పై ఎం.ఎన్‌.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర్యాప్ రాక్ ష‌కీల్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ నిరంజ‌న్ జె.రెడ్డి, ఆర్ట్‌ జె.కె.మూర్తి, ఎడిట‌ర్‌, బ‌స్వా పైడి రెడ్డి, ఛీఫ్ కో-డైరెక్టర్ ప్రకాష్ పచ్చల, పాట‌లు రామ‌జోగ‌య్య శాస్త్రి, అప్స‌ర్‌, పి.ఆర్‌.ఓ సాయి స‌తీష్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More