భారీ ధర పలికిన ‘కాటమరాయుడు’ నైజాం రైట్స్ !


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ రిలీజుకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క నైజాం హక్కులు రూ. 20 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు నైజాం ఏరియాలో మంచి పట్టు ఉండటం, సినిమాపై భారీ స్థాయి అంచనాలుండటంతో కొనుగోలుదారులు ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడానికి సిద్దమయ్యారట.

సాధారణంగా ఇంత పెట్టుబడిని వెనక్కి రాబట్టాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ పవన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇదేమంత పెద్ద టార్గెట్ కాదు. ఒక్క నైజాం ఏరియాలోని కాక చాలా ప్రాంతాల్లో ఈ సినిమా హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. కిశోర్ కుమార్ పార్దసాని డైరెక్ట్ చేస్తునం ఈ సినిమానై మార్చి 24న రిలీజ్ చేయనున్నారు. అలాగే చిత్రంలోని మూడవ పాటను రేపు రిలీజ్ చేస్తారు.