ప్రభాస్ “సలార్” ఇంటర్వెల్ ఎపిసోడ్‌కి 20 కోట్ల ఖర్చు?

Published on Apr 26, 2022 12:30 pm IST


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించిన ఈ సినిమా త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. యాక్షన్ పార్ట్ క్రేజీగా ఉండబోతోందని, ఇంటర్వెల్ ఎపిసోడ్ భారీగా ఉండబోతోందన్నది అప్ డేట్.

ఈ ఒక్క ఫైట్ కోసమే మేకర్స్ భారీ మొత్తం వెచ్చిస్తున్నారని, ఈ ఒక్క ఎపిసోడ్‌కే 20 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :