నయన్ కెరీర్ లో 75వ సినిమాపై లేటెస్ట్ భారీ అనౌన్సమెంట్.!

Published on Jul 12, 2022 12:10 pm IST


సౌత్ ఇండియన్ సినిమా దగ్గర స్టార్ హీరోయిన్స్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి కొద్ది మంది స్టార్స్ లో హీరోయిన్ నయనతార కూడా ఒకరు. మరి తమిళ్ మరియు తెలుగు భాషల్లో భారీ క్రేజ్ ఉన్న ఈమెని అయితే లేడీ సూపర్ స్టార్ అని తమిళ్ ఆడియెన్స్ పిలుచుకుంటారు. మరి రీసెంట్ గానే నయనతారకి వివాహం కూడా జరగగా ఇప్పుడు తన కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా అయినటువంటి 75వ ప్రాజెక్ట్ ఇప్పుడు అనౌన్స్ అయ్యింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ బ్యానర్ వారు అనౌన్స్ చేశారు. మరి ఒక గ్రాండ్ వీడియోతో ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయగా ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఈ చిత్రాన్ని ప్రముఖ స్టార్ దర్శకుడు శంకర్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ దర్శకుడు నీలేష్ కృష్ణా దర్శకత్వం వహించనుండగా జై మరియు సత్య రాజ్ లను ప్రస్తుతం మెయిన్ లీడ్ కాస్ట్ గా అనౌన్స్ చేశారు. ఇంకా అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :