ఎన్నో వేడుకల్లో దైవబలాన్నిస్తున్న పురాణపండ ‘ శ్రీపూర్ణిమ ‘కు జేజేలు

Published on Jun 18, 2022 3:00 pm IST

యానాం : జూన్ : 18

ఆర్ష గ్రంధాల గొప్పదనమేంటో అద్భుతంగా ఆవిష్కరించే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనాలగురించి క్రొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు.

ఎక్కడా భేషజాలు, సొంత డబ్బాలు లేకుండా దైవ బలానికి ప్రాధాన్యత ఇస్తూ సుమారు పదిహేనేళ్లుగా అపూర్వ రీతిలో పురాణపండ శ్రీనివాస్ రచించి ప్రచురిస్తున్న ధార్మిక గ్రంధాలను చూడగానే ఒక ఆత్మ విశ్వాసం , మనస్సాన్తి కలుగుతాయని పండిత, పామర , మేధో సమాజం ఖఛ్చితంగా నిజాయితీగా చెప్పే, చెబుతున్న సత్యం.

పెద్ద తరాలవారు చదువుకునేందుకు, పారాయణ చేసుకునేందుకు వీలుగా , గొప్ప శబ్ద సౌందర్యంతో , శిల్ప నిర్మాణాలతో , అర్ధ గాంభీర్యంతో, కవిత్వ సౌందర్యంతో , పరమాద్భుతమైన చిత్ర లావణ్యాలతో ప్రతీ గ్రంధాన్ని ఆకర్షణీయంగా అందించే పురాణపండ శ్రీనివాస్ ఒక మంగళతూర్యారావంగా అందించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహాగ్రంధాన్ని ఎన్నో కుటుంబాల వారు తమ గృహ ప్రవేశ ఉత్సవాలలో, వివాహ వేడుకల్లో శ్రీజ్ఞాపిక గా అందించడం పట్ల ఎందరెందరో అభినందనలు వర్షిస్తున్నారు.

విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నయ్, రాజమహేంద్రవరం, యానాం, పలాస, విజయనగరం వంటి అనేక ప్రాంతాలలో ఇటీవల జరిగిన వేడుకల్లో అధికంగా ఆకర్షించిన గ్రంధం నిస్సందేహంగా ‘ శ్రీపూర్ణిమ’ మాత్రమే.

నిజంగా ఈ రోజుల్లో ఇంత పెద్ద అపురూపమైన ధార్మిక గ్రంధానికి ఇంత ఖర్చు భరించి ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్న దాతల్ని ప్రశ్నిస్తే పురాణపండ శ్రీనివాస్ లో మొదట మనకి గొప్ప యజ్ఞభావనతో కూడిన నిస్వార్ధ సేవ కనిపిస్తుందని, తరవాత విషయానికి వస్తే శ్రీపూర్ణిమ ఏడువందల యాభైపేజీల మహాగ్రంధం యొక్క లావణ్యం వర్ణించలేమని బాహాటంగా చెబుతున్నారు.

గత రెండు సంవత్సరాలలో సుమారు పాతిక ముద్రణలకు నోచుకున్న ఈ అద్భుతమైన అమోఘ గ్రంధం యొక్క క్వాలిటీ, సమర్పణా బుద్ధి, సూపర్ కంటెంట్, రేర్ ఫొటోస్ మనల్ని కట్టేస్తాయని ప్రచురణకర్తలు పొగడ్తలు వర్షిస్తున్నారు.

ఇంతటి అఖండ గ్రంధాన్ని కూడా అధిక సంఖ్యలో పాఠక భక్తజనానికి ఉచితగా ఇవ్వడంలో పురాణపండ శ్రీనివాస్ వెనుక ఉన్న వేంకటాచల క్షేత్ర చైతన్యమే కారణమని,ఆయన ఆత్మబలాన్ని మెచ్చుకుని తీరాలని …. కేవలం సినీ, రాజకీయ ప్రముఖులే కాకుండా కొందరు న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు సైతం అభినందించడం దైవ సంకల్పం.

శరత్కాల బింబంలాంటి ఉత్తమోత్తమ రామణీయకత్వంతో పరమ సంపన్నంగా తిరుమల అలమేల్మంగమ్మ దివ్య చిత్రంతో శోభిస్తున్న శ్రీపూర్ణిమ బుక్ తెరిస్తే చివరిపేజీ వరకూ మనం పేజీలు తిప్పుతూనే ఉంటాం.

ఎదో ఒక రహస్యమయ మన్త్ర శక్తి ఋషుల అనుగ్రహమై ఈ గ్రంథమంతటా దర్శనమివ్వటమే ఈ అపురూప గ్రంథ వైభవానికి కారణం.

పురాణపండ శ్రీనివాస్ సాహిత్య, ఆధ్యాత్మిక జీవన వైభవంలో ఈ ‘ శ్రీపూర్ణిమ ‘ గ్రంధం ఒక మణిస్తంభం అని ప్రశంసించక తప్పదు. ఇది నిజం కూడా.

ఎన్నో శుభకార్యాలలో ఇంతటి గ్రంధం చేస్తూన్న పరమోత్తమమైన హడావిడి అంతా, ఇంతా కాదు.

సంబంధిత సమాచారం :