“కేజీయఫ్ చాప్టర్ 2” కి పెద్ద పోటీ వచ్చేసింది..!

Published on Nov 20, 2021 3:05 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. స్కై హై అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 14న ఫిక్స్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి ఎంతో కీలకం అయిన బాలీవుడ్ మార్కెట్ లో పెద్ద పోటీ కన్ఫర్మ్ అయ్యిపోయింది. బాలీవుడ్ కి చెందిన స్టార్ బిగ్గెస్ట్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “లాల్ సింగ్ చద్దా” కూడా ఇదే కేజీయఫ్ 2 డేట్ ఏప్రిల్ 14 కి ఫిక్స్ అయ్యింది.

హిందీ మార్కెట్ లో ఆమీర్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో కేజీయఫ్ కి ఇది గట్టి పోటీనే అని చెప్పాలి. మరి అప్పటికి బాక్సాఫీస్ పోటీ ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :