‘అజ్ఞాతవాసి’ ఆడియో పాస్ లకు భారీ డిమాండ్ !

పవన్, త్రివిక్రమ్ ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ‘అజ్ఞాతవాసి’ పై ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ఆడియో వేడుక ఇంకొద్ధిసేపట్లో మొదలుకానుంది. వేడుకను ఓపెన్ ప్లేస్ లో కాకుండా స్టార్ హోటల్ లో ప్లాన్ చేయడంతో భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యేందుకు వీలులేకుండా పోయింది. దీంతో ఎంట్రీ పాస్ లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.

ఎవరికీ వారు పాస్ లను పొందేందుకు ప్రయత్నాలు జరుపుతుండగా నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పాస్ లు ఉన్నవారికే అనుమతని, పాస్ లు దొరకని వారు ఇతర మాధ్యమాల ద్వారా వీక్షించి వేడుకను జయప్రదం చేయాలని కోరారు. సుమారు 7 అంతర్జాతీయ బ్రాండ్స్ స్పాన్సర్ చేస్తున్న ఈ వేడుకకు వెంకటేష్, ఎన్టీఆర్ లు అతిధులుగా విచ్చేస్తారనే వార్తలు కూడా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింతగా పెరిగింది.

ఈ ఈవెంట్లో చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆల్బమ్ లోని ఐదు పాటలను లైవ్ లో పెర్ఫార్మ్ చేయనున్నారు. ఇకపోతే చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.