భారీ ధర పలికిన మహేష్ ‘భరత్ అనే నేను’ హక్కులు ?

22nd, August 2017 - 08:59:28 AM


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలాంటే అన్ని భాషల పరిశ్రమలోనూ మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాల హక్కుల్ని దక్కించుకోవడానికి మొత్తాన్నే వెచ్చిస్తుంటారు డిస్ట్రిబ్యూటర్లు. ముఖ్యంగా హిందీ హక్కులకైతే భారీ డిమాండ్ ఉంటుంది. ఆయన మురుగదాస్ తో చేసిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్’ సినిమా హిందీ హక్కుల్ని ఏ.ఏ ఫిలిమ్స్ దాదాపు రూ.24 కోట్లు వెచ్చించి కొనుగోలుచేయగా ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న ‘భరత్ అనే నేను’ హిందీ హక్కులు రూ. 16 కోట్లకు అమ్ము అమ్ముడైనట్లు వినికిడి.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఖచ్చితమైన సమాచారం వెలువడితే అమ్ముడైన మొత్తం ఎంతో తెలుస్తుంది. ఇటీవలే లక్నో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన కొత్త నటి కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.