‘కార్తికేయ – 2’ తెలుగు రాష్ట్రాల రైట్స్ కి సూపర్ డిమాండ్ ….!

Published on Jun 28, 2022 11:00 pm IST

యువ నటుడు నిఖిల్ సిద్దార్ధ, నటి అనుపమ పరమేశ్వరన్ కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ కొట్టి ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్న కార్తికేయ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్నదే కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తుండగా కాలభైరవ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ రావడంతో పాటు అవి మూవీ పై మరింతగా అంచనాలు పెంచాయి. సూపర్ విజువల్స్, బీజీఎమ్, డైలాగ్స్, థ్రిల్లింగ్ అంశాలు వంటివి కార్తికేయ ట్రైలర్ లో అదిరిపోయాయి. జులై 22న వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడడంతోపాటు అవి మంచి ధర పలుకుతున్నట్లు టాక్. ఇప్పటికే పలు సంస్థల వారు ఎంతో గట్టిగా ఆ రైట్స్ దక్కించుకునేందుకు ట్రై చేస్తున్నారని, త్వరలోనే అవి అమ్ముడైన అనంతరం అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. మరి అందరిలో బాగా హైప్ సంపాదించిన కార్తికేయ 2 మూవీ విడుదల తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :