ప్రపంచ అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ లో ప్రభాస్ సినిమాకి భారీ డిమాండ్

ప్రపంచ అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ లో ప్రభాస్ సినిమాకి భారీ డిమాండ్

Published on Jun 12, 2024 12:00 PM IST

ఇప్పుడు భారతీయ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని లు ముఖ్య పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి. తెలుగు సినిమా నుంచి మరో గర్వించదగ్గ సినిమా వస్తుంది అని ట్రైలర్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది.

అయితే ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ లో భారీ క్రేజ్ నెలకొంది. అయితే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా ప్రపంచ దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అలా ప్రపంచపు అతి పెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో ఒకటైన ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ ఐమ్యాక్స్ లో భారీ డిమాండ్ నెలకొందట. ఆల్రెడీ అక్కడ షోస్ ప్లాన్ చేయగా అవన్నీ ఫిల్ అయిపోవడంతో అదనపు షోని తెలుగులో వేస్తున్నట్టుగా వారు తెలియజేసారు. దీనితో ప్రభాస్ సినిమాకి ఏ లెవెల్లో డిమాండ్ నెలకొందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు