“ఆదిపురుష్” టీజర్ పై భారీ అంచనాలు..ఈ అంశాలు ఎలా ఉంటాయి?

“ఆదిపురుష్” టీజర్ పై భారీ అంచనాలు..ఈ అంశాలు ఎలా ఉంటాయి?

Published on Oct 2, 2022 4:00 PM IST

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం ప్రభాస్ “ఆదిపురుష్” కాగా దాని నుంచే వచ్చే టీజర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ టీజర్ లాంచ్ అయోధ్యలో జరగనుండగా పాన్ ఇండియా భాషల్లో ఈ టీజర్ అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ రోజు రానున్న టీజర్ పై ఎన్నో అంచనాలు నెలకొనడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. మరి అవన్నీ ఈరోజే క్లియర్ అవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యినప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా చిన్న లీక్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. రీసెంట్ టైమ్స్ లో అయితే అసలు ఏ సినిమాకి కూడా ఇలా జరగలేదు.

నిజంగా ఇది ఒక మంచి విషయం. ఇక దీనిని పక్కన పెడితే మేకర్స్ మొదటి నుంచి ఈ చిత్రాన్ని ఓ బిగ్గెస్ట్ విజువల్ డ్రామాలా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లారు. దీనితో ఈ సినిమా ఎలా ఉంటుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇప్పటికీ కూడా చాలా మంది ఇదొక యానిమేషన్ లాంటి సినిమా అని అనుకుంటున్నారు.

మరి దానికి కూడా ఈరోజు టీజర్ తో సమాధానం దొరకనుంది. ఇక వీటితో పాటుగా మేకర్స్ చెప్పిన విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? ఎంత రియలిస్టిక్ గా ఉంటాయి అనే దానిపై కూడా ఓ క్లారిటీ అయితే వస్తుంది. అందుకే ఆదిపురుష్ టీజర్ పై మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు