అజిత్ “వలిమై” గ్లింప్స్ పై భారీ అంచనాలు..!

Published on Sep 23, 2021 7:00 am IST


కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వలిమై”. దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై ఎప్పుడు నుంచో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా భారీ రెస్పాన్స్ తో అవి సెన్సేషన్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా నుంచి నిన్న ఇండస్ట్రీ వర్గాల్లో టీజర్ వస్తుంది అని మొదట బజ్ రాగా తర్వాత ముందు చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని ఫిక్స్ అయ్యింది. దీనితో ఈ వీడియో పై భారీ అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మన సౌత్ ఇండియాలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” వీడియో భారీ రెస్పాన్స్ ఫస్ట్ ఎవర్ 1 మిలియన్ లైక్డ్ వీడియో గా ఇండియన్ రికార్డునే సెట్ చేసింది.

మరి దీనిని అజిత్ బ్రేక్ చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. ఎప్పుడు నుంచో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఇది దీనితో సరికొత్త రికార్డులు వారు నమోదు చేయడం పెద్ద విషయం ఏమి కాదని చెప్పాలి. మరి నిన్ననే ఈ సినిమా రిలీజ్ ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కి మేకర్స్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం :