“అఖండ” మాస్ ట్రైలర్ పై భారీ అంచనాలు.!

Published on Nov 14, 2021 9:31 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు తన మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్లాన్ చేసిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “అఖండ”. అనౌన్స్ చేసి సినిమా ఫస్ట్ టీజర్ ని లాంచ్ చేసినప్పుడు నుంచీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక ఇదిలా ఉండగా నిన్న చిత్ర యూనిట్ ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని ఈరోజుకి ఫిక్స్ చేసినట్టుగా అనౌన్స్ చెయ్యడంతో ఈ ఇక్కడ నుంచి భారీ హైప్ స్టార్ట్ అయ్యింది. ట్రైలర్ కట్ ఎలా ఉంటుందా అని బాలయ్య ని బోయపాటి ఈసారి ఎంత పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తున్నారు? ఎలాంటి మాస్ డైలాగ్స్ పలికించబోతున్నారా అని బాలయ్య అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టాక్ పరంగా అయితే ఉన్న అంచనాలకు మించే ఈ ట్రైలర్ కట్ ఉంటుందట.

సంబంధిత సమాచారం :

More