“కేజీయఫ్ 2” ట్రైలర్ పై ఓ రేంజ్ లో భారీ అంచనాలు.!

Published on Mar 27, 2022 10:00 am IST

కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” పై ఉన్న హైప్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ ఓ సీక్వెల్ సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పాలి.

ఈ సినిమా కోసం ఆడియెన్స్ అసలు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అనే దానికి అయితే ఆ మధ్య యష్ బర్త్ డే కి రిలీజ్ చేసిన గ్లింప్స్ కి వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్ బట్టే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ చెయ్యడానికి సన్నద్ధం చేశారు. ఇక ఫైనల్ గా ఆరోజు రానే వచ్చింది.

దీనిని కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. మరి ఈరోజు అన్ని భాషల్లో ఓ గ్రాండ్ ఈవెంట్ తో ఈ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యబోతుండగా దీనిపై మాత్రం సాలిడ్ అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఈ క్రేజీ ట్రైలర్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ లెవెల్లో కట్ చేసారో తెలియాలి అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల 40 నిమిషాల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :