పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఇప్పుడు జపాన్ లో క్రేజ్ ఫుల్ గా పెరిగింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాకు జపాన్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 2011లో వచ్చిన ఈ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేశారు. ఐతే, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ తో జపాన్ లో ప్రభాస్ ను చాలా బాగా ఆదరిస్తున్నారు.
దీంతో వచ్చే నెల 27న రిలీజ్ కానున్న ప్రభాస్ ‘కల్కి’ సినిమా పై ఇప్పుడు జపాన్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కల్కి కి రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తాయని అంచనా ఉంది. 2017లో జపాన్ లో ‘బాహుబలి’ రిలీజవగా.. అక్కడ దాదాపు 1 మిలియన్ యూ.ఎస్.డిలను వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. కాగా కల్కి ఆ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసే అవకాశం ఉంది.