మెగాస్టార్ “గాడ్ ఫాదర్” పై పెరుగుతున్న అంచనాలు!

Published on Sep 24, 2022 3:00 am IST


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా లో నయనతార లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం ను అక్టోబర్ 5, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటం తో ఫుల్ స్వింగ్ లవ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

అయితే ఈ చిత్రం పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మెగాస్టార్ లుక్ మేకోవర్ కి ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార కంటెంట్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం లో పూరి జగన్నాథ్, సత్యదేవ్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :