రామ్ పోతినేని “ది వారియర్” పై పెరుగుతున్న అంచనాలు!

Published on Jul 4, 2022 12:00 am IST


రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం లో రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ను జూలై 14, 2022 న భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కి సైతం అద్దిరిపొయే రెస్పాన్స్ రావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదల చేసిన మరో సాంగ్, విజిల్ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు 14 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. రిలీజైన ప్రచార చిత్రాలు సినిమా పై మరింత ఆసక్తి ను పెంచేశాయి. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :