బాలీవుడ్ లో ‘బాహుబలి’ హవా అంతా ఇంతా కాదు !
Published on Jan 2, 2017 8:46 am IST

baahubali-2
భారతీయ చలన చిత్ర రంగంలో సంచలనంగా నిలిచిపోయిన ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్ గా రానున్న ‘బాహుబలి – 2’ పట్ల అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు ఆడియన్స్ తో సమానంగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొన్నీ మధ్య నిర్వహించిన సర్వేలో కూడా అన్ని బాలీవుడ్ సినిమాల్ని పక్కకు నెట్టి ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో బాహుబలి మొదటి స్థానంలో నిలవడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

ప్రేక్షకుల్లో ఉన్న ఈ క్రేజ్ ను గుర్తించే ఈ చిత్ర హిందీ సమర్పకులు ముందుగా అనుకున్న థియేటర్ల సంఖ్యను ఇప్పుడు రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 28న ఈ సినిమాకు పోటీగా మరే హిందీ సినిమా రిలీజ్ కాకపోవడం మరో విశేషం. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాకు బాలీవుడ్ లో ఇంతటి ప్రాధాన్యత దక్కలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇకపోతే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటోంది.

 
Like us on Facebook