‘కిచ్చ’ సుదీప్ సినిమాకి భారీ ఆఫర్.. అయినా నో చెప్పిన మేకర్స్!

Published on Jan 8, 2022 6:22 pm IST


కన్నడ స్టార్ హీరోస్ లో మన టాలీవుడ్ కి కూడా సుపరిచితం అయ్యిన వారిలో కిచ్చ సుదీప్ కూడా ఒకరు. అయితే కన్నడలో ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సుదీప్ ఆల్రెడీ నటించిన తన కెరీర్ లో బిగ్గెస్ట్ చిత్రం ఒకటుంది అదే “విక్రాంత్ రోనా”. తన కెరీర్ లో అధిక బడ్జెట్ తో పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ భారీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ ని కూడా చేసుకుంది.

అయితే ఈ సినిమాకి గాను రీసెంట్ గా భారీ స్థాయి ఓటిటి ఆఫర్ వచ్చిందట. మరి ఈ సినిమాకి గాను ఏకంగా 100 కోట్లకి పైగా ఆఫర్ ని ప్రముఖ ఓటిటి సంస్థ వారు ఇచ్చారట. కానీ దీనికి చిత్ర నిర్మాతలు నో చెప్పేశారని కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా కేవలం బిగ్ స్క్రీన్స్ పై చూసే విధంగా తీశామని అందుకే ఈ ఆఫర్ ని వదులుకుంటున్నట్టుగా వారు తెలిపారు.

మరి ఈ సినిమాకి అనూప్ భందారి దర్శకత్వం వహించగా షాలిని మంజునాథ్, జాకీ మంజునాథ్ లు భారీ వ్యయంతో నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరి 24న ప్రపంచ వ్యాప్తంగా 3డి లో రిలీజ్ కానున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :