విక్రమ్ “తంగలాన్” కి భారీ ఓటిటి ఆఫర్.?

విక్రమ్ “తంగలాన్” కి భారీ ఓటిటి ఆఫర్.?

Published on Nov 13, 2022 7:02 AM IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “పొన్నియిన్ సెల్వన్” తో కెరీర్ లోనే మరో భారీ హిట్ ని అయితే తమిళ్ నుంచి అందుకున్నాడు. ఇక నెక్స్ట్ కూడా దీని పార్ట్ 2 తో రెడీగా ఉండగా ఈ హిట్ పరంపర లోనే తమిళ స్టార్ అండ్ ఇంటెన్స్ దర్శకుడు పా రంజిత్ తో అనౌన్స్ చేసిన మరో పాన్ ఇండియా సినిమానే “తంగలాన్”.

రీసెంట్ గా అనౌన్సమెంట్ టీజర్ తో మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం ఇపుడు భారీ ఓటిటి ఆఫర్ ని లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు భారీ మొత్తం 35 కోట్లు చెల్లించి అయితే స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకున్నారట. దీనితో అయితే ఈ చిత్రం అప్పుడే సెన్సేషన్ ని మొదలు పెట్టింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు