భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన ‘రంగస్థలం’ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ వల్లనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరుగుతోంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా యొక్క నైజాం, సీడెడ్ హక్కులు దగ్గరదగ్గర రూ.30 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. గతంలో సినిమా యొక్క తెలుగు శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులుసుమారు రూ.20 కోట్లకు పైగానే అమ్ముడవగా హిందీ శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ హిందీ ఛానెల్ రూ. 10.50 కోట్లకు కొనుగోలు చేయగా ఆడియో హక్కులు రూ.1.5 కోట్లకు అమ్ముడయ్యాయి.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 24న సినిమా యొక్క టీజర్ రిలీజ్ కానుంది.