పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ కాప్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సందీప్ రెడ్డి రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే పలు సంచలనాలకు కేరాఫ్‌గా మారుతుంది.
ఇప్పటికే ఈ క్రేజీ కాంబో పై అదిరిపోయే బజ్ క్రియేట్ కావడంతో ఈ చిత్ర డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌కు ఏకంగా రూ.250 కోట్ల భారీ డీల్ అందించినట్లు తెలుస్తోంది. ఇంతటి భారీ మొత్తం కేవలం డిజిటల్ రైట్స్ కోసం వస్తుండటంతో ఈ మూవీపై క్రేజ్ ఏ రేంజ్‌లో నెలకొందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ తన పర్ఫార్మె్న్స్‌తో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఇవ్వబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2027 మే 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
