ఓవర్సీస్ లో కాటమరాయుడి హవా!


సాధారణంగానే పవన్ కళ్యాణ్ కు ఓవర్సీస్లో ఫాలోయింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆయన గత సినిమాల ఓపెనింగ్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. పైగా కొన్ని రోజుల క్రితమే పవన్ యూఎస్ పర్యటనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అక్కడి తెలుగువారు ఆయనపై మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రభావము ప్రస్తుతం ఆయన నటించి రిలీజుకు సిద్ధంగా ఉన్న ‘కాటమరాయుడు’ పై కూడా పడింది.

ప్రేక్షకుల్లో రెట్టించిన ఆసక్తిని గమనించిన అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మొదటిరోజు ఈ చిత్రం సుమారు 250 స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. పవన్ గత సినిమాలతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త ఎక్కువే. దీని వలన సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండనున్నాయి. నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకుని U సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మార్చి 24న విడుదలకానుంది.