విజయ్ ‘లియో’ కి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న సంజయ్ దత్ ?

Published on May 19, 2023 1:32 am IST

ఇళయదళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ పై లలిత్ కుమార్, జగదీశ్ పళని స్వామి నిర్మిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లియో. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా దీనిని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక ఈ మూవీలో సంజయ్ దత్ నెగటివ్ రోల్ చేస్తుండగా ఇతర పాత్రల్లో అర్జున్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.

విషయం ఏమిటంటే, ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ భారీ స్థాయిలో రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల బజ్. ఈ మూవీలో హీరోకి ధీటు గా విలన్ పాత్ర కూడా ఉంటుందని, ఇటీవల కెజిఎఫ్ మూవీలో అధీరా పాత్రలో అదరగొట్టిన సంజయ్ దత్ మరొక్కసారి లియోలో కూడా తన నటనతో ఆకట్టుకోవడం ఖాయం అంటోంది యూనిట్. హీరో విజయ్ ఒక మాస్ యాక్షన్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈమూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరొక నాలుగు నెలలు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :