“బంగార్రాజు” అరాచకం మామూలుగా లేదుగా!

Published on Jan 17, 2022 12:01 am IST


అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య లు హీరోలుగా నటించిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి విజయవంతం గా ప్రదర్శింప బడుతోంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా ఈ చిత్రం రావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం మూడవ రోజు థియేటర్ల లో హౌజ్ ఫుల్ అవ్వడమే కాకుండా, మరికొన్ని ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్య ను పెంచడం జరిగింది. సంక్రాంతి పండుగ కావడం, మరే పెద్ద సినిమా లేక పోవడం బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద ఊచ కోత కొస్తున్నాడు. మంచి వసూళ్లను రాబడుతూ దిగ్విజయం గా దూసుకు పోతున్నాడు. రమ్య కృష్ణ, కృతి శెట్టి లు లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :