‘ఖైదీ’ నీరు నీరు పాటకు సూపర్ రెస్పాన్స్!
Published on Jan 5, 2017 8:45 am IST

khaidi150
మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత హీరోగా ‘ఖైదీ నెం. 150’తో రీ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా ఆడియోలోని నాలుగు పాటలు విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా నిన్న సాయంత్రం థీమ్ సాంగ్ ‘నీరు నీరు’ విడుదలైంది. విడుదలవ్వడంతోనే ఈ పాట నెటిజన్ల వద్దనుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

దేవిశ్రీ అందించిన ట్యూన్, శంకర్ మహదేవన్ గానం, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అన్నీ టాప్ క్లాస్‌లో ఉండి పాటకు ఒక స్థాయి తెచ్చిపెట్టాయి. సినిమా అసలు కథతో సంబంధం ఉన్న రైతుల కష్టాలను ప్రస్తావించిన ఈ పాటతో సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి ఆసక్తి మరింత పెరిగిపోయింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించారు. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook