లవ్ స్టోరీ సినిమాకి భారీ రెస్పాన్స్…ఓ రేంజ్ లో బుకింగ్స్!

Published on Sep 24, 2021 5:59 pm IST

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదల అయ్యి సర్వత్రా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆంధ్రా నుండి అమెరికా వరకూ ప్రతి చోట కూడా ఈ సినిమా హౌజ్ ఫుల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కి బుక్ మై షో లో 92 శాతం మంది ఇంటరెస్ట్ కనబరిచినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు ప్రేక్షకుల నుండి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుండటం తో సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం లవ్ స్టోరీ తోనే అని చెప్పాలి. టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు సినిమా విజయం సాధించాలి అంటూ చెప్పుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం :