భారీ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోన్న మహేష్ “పెన్నీ సాంగ్”

భారీ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోన్న మహేష్ “పెన్నీ సాంగ్”

Published on Mar 21, 2022 10:48 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు 14రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం మే 12, 2022 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా రెండవ సింగిల్ పెన్నీ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో 10 మిలియన్స్ కి పైగా భారీ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతుంది. అంతేకాక ఈ పాటకు 500కే కి పైగా లైక్స్ రావడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు