నాని “అంటే సుందరానికి” టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్!

Published on Apr 21, 2022 10:40 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రం లో మలయాళ నటి నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ యూ ట్యూబ్ లో ప్రస్తుతం టాప్ లో ట్రెండ్ అవుతోంది. 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించి దూసుకు పోతుంది. జూన్ 10, 2022 న విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :