అన్నాత్తే కి బుల్లితెర పై భారీ రెస్పాన్స్!

Published on Jan 20, 2022 11:02 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన చిత్రం అన్నాత్తే. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సూరి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి మిశ్రమ స్పందన సాధించింది.

ఈ చిత్రం తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి సారి 21.60 రేటింగ్ రావడం విశేషం. ఈ తరహా భారీ రెస్పాన్స్ రావడం, అది కూడా హిట్ సినిమా కాకపోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డి. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :