భారీ రెస్పాన్స్ తో “స్పైడర్ మ్యాన్” సరికొత్త ట్రైలర్.!

Published on Nov 18, 2021 8:02 am IST

ప్రపంచ వ్యాప్తంగా కూడా మర్వెల్ కామిక్స్ కి కానీ వారి ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలకు కానీ ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు వారి ఫ్రాంచైజ్ నుంచి సరికొత్త ఫేజ్ ని స్టార్ట్ చేసిన యూనిట్ లేటెస్ట్ గా తమ మోస్ట్ అవైటెడ్ సినిమా “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” నుంచి సరికొత్త ట్రైలర్ ని రిలీజ్ చేసింది. మొదటి ట్రైలర్ తోనే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఈ ట్రైలర్ తో వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ని ఇంకోసారి కట్టి పడేసింది.

ఎన్నో అంచనాలు నడుమ నిన్న రిలీజ్ అయ్యిన ఈ ట్రైలర్ ఇపుడు ఇండియన్ యూట్యూబ్ ట్రెండ్స్ లో కూడా ట్రెండ్ అవుతుంది. మల్టీవర్స్ కాన్సెప్ట్ తో మైండ్ బ్లోయింగ్ గా ఈ సినిమా తెరకెక్కింది. గత స్పైడర్ మ్యాన్ సిరీస్ లలో అందరి విలన్స్ తో అదిరిపోయే విజువల్స్ తో మర్వెల్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే విధంగా డైరెక్టర్ జాన్ వాట్స్ తెరకెక్కించారు.

ఇక ఈ ట్రైలర్ కి 24 గంటల్లో 31మిలియన్ కి పైగా వ్యూస్ 2 మిలియన్ కి పైగా లైక్స్ సాధించి రికార్డు సెట్ చేసింది. ఈ స్థాయి రెస్పాన్స్ అయితే లాస్ట్ టైం అవెంజర్స్ సిరీస్ కే ఉంది. అంటే ఈ లెక్కన ఈ సినిమా కోసం ఎంత కేజ్రీగా ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.

భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఓవరాల్ గా ఎంత వసూలు చేస్తుందో అన్నది చూడాలి. అలాగే ముగ్గురు స్పైడర్ మ్యాన్ లు కూడా కనిపిస్తారా లేదా అనే ప్రశ్న ఫ్యాన్స్ ని మరింత ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More