మహేష్ “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ కి భారీ రెస్పాన్స్

మహేష్ “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ కి భారీ రెస్పాన్స్

Published on Mar 20, 2022 10:05 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుండి పెన్ని సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటకు సోషల్ మీడియా లో భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ మరియు 340కే కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు