అనుష్క కోసం భారీ సెట్టింగ్ !
Published on Feb 12, 2017 11:57 am IST


లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క చేస్తున్న మరో చిత్రం ‘భాగమతి’. ‘పిల్లజమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చాలా కాలం నుండి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ స్టూడియోలో ఒక ప్రత్యేకమైన భారీ భవంతి సెట్ వేశారట ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి. కొన్ని వందల ఏళ్ళు క్రితం నాటి కట్టడంలా ఉండే ఈ భవంతిలోనే చిత్రంలోని ప్రముఖ సన్నివేశాల షూటింగ్ జరుగుతుందట.

ఈ పిరియాడికల్ డ్రామాలో ప్రముఖ తమిళ నటుడు జయరాం ఒక పొలిటీషియన్ పాత్రలో కనిపించనుండగా ‘జనతా గ్యారేజ్’ ఫేమ్ ఉన్ని ముకుందన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనునందు. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ట్రైలర్, ఆడియో, చిత్ర విడుదల ఎప్పుడని విషయాలపై ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ ఇంకా బయటకు రాలేదు.

 
Like us on Facebook