సాయి తేజ్ సినిమాకి భారీ సెట్స్ తో “హను మాన్” మేకర్స్

సాయి తేజ్ సినిమాకి భారీ సెట్స్ తో “హను మాన్” మేకర్స్

Published on Jul 3, 2024 1:59 PM IST


మెగా యంగ్ హీరో సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ హీరోగా తన లాస్ట్ చిత్రం “బ్రో” తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తన కెరీర్ 18వ సినిమాని ఇటీవల స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి కొత్త దర్శకుడు రోహిత్ కే పి తో “హను మాన్” నిర్మాత నిరంజన్ రెడ్డి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన భారీ చిత్రం ఇది. మరి ఈ సినిమా అయితే సాయి ధరమ్ రేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ కథాంశంతో వస్తున్నా ఈ సినిమా కోసం ఇప్పుడు మేకర్స్ భారీ సెట్టింగులని వేస్తున్నారట. హైదరాబాద్ లో పలు భారీ సెట్స్ నడుమ ఈ సినిమాని వారు తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాకి సుమారు 100 కోట్ల పైగానే మేకర్స్ వెచ్చిస్తున్నట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి అంతలా సినిమాలో ఏం మ్యాజిక్ ఉందో అనేది కొన్నాళ్ళు ఆగి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు