ఊహకందని భారీ ధరకు అమ్ముడైన రోబో 2 శాటిలైట్ హక్కులు !


సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజైన ‘రోబో’ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో చాలా గ్రాండ్ గా నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మొదలైన ఈ చిత్రం యొక్క ఆఖరి షెడ్యూల్ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తవగా ఇంకాస్త ప్యాచ్ వర్క్, ఒక పాట మాత్రమే మిగిలున్నాయి.

ఇకపోతేఈ భారీ బడ్జెట్ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు ఊహకందని భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముహా టీవీ ఛానెల్ ఈ హక్కులను రూ. 110 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల రైట్స్ కు ఈ ధరను చేల్లించారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు మహాలింగం తెలిపారు. ఈ సినిమాకు నిర్వ సాహా సినిమాటోగ్రఫీని, ఏఆర్ రెహ్మన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18 దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.