చిరంజీవికి మరో హీరోయిన్ కూడా కావాలట

Chiranjeevi

సైరా నరసింహారెడ్డి లాంటి భారీ పీరియాడిక్ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయడానికి ఒప్పుకున్నారు. చిరు-కొరటాల శివ ల మూవీ గత ఏడాదే కన్ఫార్మ్ ఐయ్యింది. చిరుతో మూవీ చేయడానికి కొరటాల దాదాపు ఏడాదికి పైగా స్క్రిప్ట్ తో ఎదురు చూశారు. సోషల్ కంటెంట్ తో కూడిన కమర్షియల్ మూవీస్ తీయడంలో సిద్ధహస్తుడైన కొరటాల పనితనం మెచ్చి చిరు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 152వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ కొరకు ఒక హీరోయిన్ గా త్రిషను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

2006లో వచ్చిన స్టాలిన్ మూవీలో చిరు-త్రిష కలిసి నటించారు. కాగా ఈ మూవీలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందట. సెకండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే వేటలో ప్రస్తుతం చిత్ర బృందం ఉందట. ఇక కొరటాల ఓ వినూత్నమైన సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

Exit mobile version