వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న”హంట్”

Published on Nov 21, 2023 11:30 am IST

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మహేష్ సూరపనేని డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ హంట్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ఈ ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. శ్రీకాంత్, భరత్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :