త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సుధీర్ బాబు “హంట్”

Published on May 23, 2023 9:32 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మహేష్ సూరపనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ హంట్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది. త్వరలో హంట్ మూవీ జెమిని టీవీ లో ప్రసారం కానుంది.

శ్రీకాంత్, భరత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :