SSMB29 : అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్న జక్కన్న ?

SSMB29 : అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్న జక్కన్న ?

Published on Nov 30, 2022 2:58 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఆయన చేస్తున్న SSMB28 మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా సెకండ్ షెడ్యూల్ అతి త్వరలో జరుగనుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే దీని తరువాత దిగ్గజ దర్శకుడు టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ మూవీ అయిన SSMB29 ప్రాజక్ట్ లో నటించనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో గ్లోబ్ ట్రాటింగ్ గ్రాండియర్ అడ్వెంచర్ మూవీగా నిర్మాత కేఎల్ నారాయణ దీనిని నిర్మించనున్నారు.

ఇక తన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో కూడా ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించి మాట్లాడిన జక్కన్న, టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నానని, ఇండియానా జోన్స్ మాదిరిగా సాగే భారీ యాక్షన్ అడ్వెంచర్ గా దీనిని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. నిజానికి ఈ ప్రాజక్ట్ ఇంకా ప్రారంభం కూడా కానప్పటికీ ఇప్పటినుండే అందరిలో దీనిపై విపరీతమైన అంచనాలు ఉండడం, ఇక లేటెస్ట్ గా రాజామౌళి చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అంచనాలు అంతకంతకూ పెరిగిపోతుండడం జరుగుతోంది. అయితే వరల్డ్ వైడ్ గా ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి అంచనాలు అందుకుని భారీ విజయం సాధించేలా రాజమౌళి అండ్ టీమ్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ అత్యద్భుతంగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ క్రేజీ మూవీ పక్కాగా ఎప్పుడు మోదవుతుందో తెలియాలి అంటే మరికొన్ని నెలల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు