“లాలా భీమ్లా” డీజే పై ఓ రేంజ్ లో పెరుగుతున్న హైప్.!

Published on Dec 31, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సంయుక్త మీనన్ అలాగే నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ రీమేక్ సినిమా “భీమ్లా నాయక్”. అవుట్ అండ్ అవుట్ మాస్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ భారీ సినిమాని మేకర్స్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసేసారు. మరి ఈ సినిమాకి ఇప్పటి వరకు నెలకొన్న హైప్ లో సగం సంగీత దర్శకుడు థమన్ వల్ల వచ్చిందే అని చెప్పాలి.

మరి థమన్ ఇచ్చిన మాస్ సాంగ్ లాలా భీమ్లా కి డీజే వెర్షన్ ని ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31న సాయంత్రం 7 గంటలకి రిలీజ్ చేయనుండగా ఈ డే కూడా వచ్చేయడంతో పవన్ అభిమానులు మరియు మ్యూజిక్ లవర్స్ ఈ బ్లాస్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సాలిడ్ హైప్ ఈ సాంగ్ పై నెలకొంది. ఇక ఇది వచ్చాక 31 రాత్రి రచ్చ ఇంకో లెవెల్ కి వెళ్తుంది అని చెప్పాల్సిందే.

సంబంధిత సమాచారం :