“విక్రమ్” లో సూర్య ఎంట్రీపై ఓ రేంజ్ లో హైప్ ఎక్కిస్తున్నారుగా.!

Published on May 28, 2022 7:02 am IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “విక్రమ్ హిట్ లిస్ట్”. కమల్ కెరీర్ లో మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సాలిడ్ డ్రామా ని దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తీసాడు. అయితే పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాలో ఇంత హైప్ ఉండడానికి కారణం కమల్ తో పాటు మరికొందరు వెర్సిటైల్ స్టార్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహాద్ ఫాజిల్ వీరితో పాటుగా స్టార్ హీరో సూర్య ల కలయిక ఉండడంతో ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

అయితే సూర్య రోల్ పై మాత్రం మేకర్స్ ఇప్పుడు ఒక రేంజ్ లో హైప్ ఎక్కిస్తున్నారు. సినిమాలో సూర్య ఎంట్రీ మామూలుగా ఉండదని ఖచ్చితంగా థియేటర్స్ ఆ ఎంట్రీ కి ఇన్సూరెన్స్ లు చేయించుకోవాలని అంటున్నారు. ఆ టైం లో ఆడియెన్స్ చెసే సందడి ఆ లెవెల్లో ఉంటుంది అని అంటున్నారు. మరి మొత్తానికి అయితే సూర్య ఎంట్రీ పరంగా హైప్ ని చాలా ఎక్కిస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఇది ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :