“టైగర్ నాగేశ్వరరావు” పై పెరుగుతున్న అంచనాలు.!

Published on Sep 27, 2023 10:00 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ నపూర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ సెట్టింగ్స్ తో అయితే నిర్మాణం వహించారు. మరి అందుకు తగ్గట్టుగానే ఓ రేంజ్ లో హైప్ ని అందుకున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ పై కూడా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందించారు.

అయితే వీటితోనే మంచి అంచనాలు అయితే మేకర్స్ అంతకంతకూ పెంచుతూ వెళ్తున్నారు అని చెప్పాలి. ఇప్పటికే టీజర్ కి మాసివ్ స్పంద వచ్చింది. దీనితో ఈ ట్రైలర్ సహా సినిమా విషయంలో కూడా ఇప్పుడు ఫ్యాన్స్ లో అయితే మరింత నమ్మకం కలుగుతుంది. వీటితో అయితే ఇప్పటివరకు హైప్ మీటర్ లో మాత్రం టైగర్ నాగేశ్వరరావు గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తుంది తప్పితే తగ్గలేదు అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :