శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘హైపర్’

18th, August 2016 - 04:35:38 PM

hyper
‘నేను శైలజ’ హిట్ తరువాత ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్’ చేస్తున్న చిత్రం ‘హైపర్’. ‘సంతోష్ శ్రీనివాస్’ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం ఆగష్టు 5 నుండి వైజాగ్ లో జరుపుకుంటున్న షూటింగ్ షెడ్యూల్ నిన్నటితో పూర్తిచేసుకుంది. ఇక తరువాతి షెడ్యూల్ ను రేపటి నుండి హైదరాబాద్ లో ప్రారంభించనుంది.

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర లు సంయుక్తంగా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన ‘రాశి ఖన్నా’ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో రామ్ పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని, ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీఠ వేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఆడియో, 30వ తేదీన సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.