‘హైపర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

hyper-in
రామ్ హీరోగా నటించిన ‘హైపర్’ సినిమా గత శుక్రవారం (సెప్టెంబర్ 30న) పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్ళు రాబడుతోంది. ముఖ్యంగా పక్కా మాస్ కమర్షియల్ సినిమా కావడంతో టార్గెట్ ఆడియన్స్ దగ్గర్నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక మొదటి మూడు రోజుల వీకెండ్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 8 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. దసరా సీజన్ కావడంతో రానున్న రోజుల్లో కూడా కలెక్షన్స్ ఇదే రేంజ్‌లో ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించారు. 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు.