‘హైపర్’ ట్రైలర్ టాక్ : సెంటిమెంట్, రొమాన్స్ ఓ రేంజులో ఉంది !
Published on Sep 24, 2016 11:47 am IST

hyper

‘నేను శైలజా’ హిట్ తరువాత హీరో రామ్ చేసిన చిత్రం ‘హైపర్’ చిత్రం తాలూకు ట్రైలర్ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోంది. 2 నిముషాల 6 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో ముఖ్యంగా హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. తండ్రి మీద అతి ప్రేమ ఉన్న కొడుకుగా రామ్, కొడుకు ప్రేమని భరించలేని తండ్రిగా సత్య రాజ్ ల నటన కొత్తగా ఉంది.

అలాగే హీరోయిన్ రాశి ఖన్నా గ్లామరస్ అప్పీయరెన్స్ కూడా కనులవిందు చేసింది. డ్రెస్సింగ్ రూమ్ లో రామ్, రాశి ఖన్నా ల మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశం చూస్తే సినిమాలో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక పొలిటికల్ బ్యాక్ గా రావు రమేష్ స్క్రీన్ పప్రెజెన్స్ కూడా బాగుంది. మాస్ డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తం మీద ట్రైలర్ చూస్తే సినిమాలో సెంటిమెంట్, రొమాన్స్ ఓ రేంజులో ఉన్నాయి.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 
Like us on Facebook