జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘హైపర్’

hyper-ram-press
‘నేను శైలజ’ చిత్రం విజయంతో గదిలో పడ్డ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హైపర్’. ‘కందిరీగ’ చిత్రంతో రామ్ కు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సంతోష్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. అందుకే ఇందులోని ముఖ్యమైన పాటలను విదేశాల్లో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా యూనిట్ ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. తండ్రి, కొడుకుల మధ్య సాగే అనుబంధ కథా చిత్రంగా హాపర్ ఉండబోతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘అనిల్ సుంకర’ నిర్మిస్తున్నారు. ‘జిబ్రాన్’ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ‘రాశి ఖన్నా’ రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.