ఆయన అంటే చాలా ఇష్టం – త్రిష

Published on Jan 2, 2023 7:28 pm IST

సీనియర్ హీరోయిన్ త్రిష మళ్లీ హీరోయిన్ గా బిజీ అయింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా చాలా రకాలుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ సినిమా త్రిష కి బాగా కలిసొచ్చింది. మొత్తానికి మణిరత్నం సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది త్రిష. పైగా తన నటనతో, గ్లామర్ తో వరుసగా ఆఫర్స్ ని కూడా దక్కించుకుంటుంది.

అన్నిటికీ మించి ఇప్పటికే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోను, అటు తమిళనాడులోనూ త్రిష తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే తను నటించిన రాంగీ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రమోషన్స్ లో త్రిష రజినీకాంత్ పై క్రేజీ కామెంట్స్ చేసింది. తనకు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చాలా ఇష్టం అని, ఆయనతో ఫుల్ టైమ్ హీరోయిన్ గా నటించాలని ఉందని త్రిష చెప్పుకొచ్చింది. అన్నట్టు త్రిష త్వరలోనే విజయ్, అజిత్ తో కలిసి నటించనుంది.

సంబంధిత సమాచారం :