ఇంటర్వ్యూ: వివి.వినాయక్ – సినిమా సూపర్ హిట్టైన ఫీలింగ్లో ఉన్నాను !

vv-vinayak
తెలుగు సినీ లోకమంతా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ని డైరెక్ట్ చేసిన ఘనత దక్కించుకున్న దర్శకుడు వినాయక్. చిరంజీవితో కలిసి గతంలో సాధించిన ‘ఠాగూర్’ సక్సెస్ ని మళ్ళీ రిపీట్ చేస్తానంటున్న అయన సినిమా గురించిన విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమా విడుదల రేపే కదా.. ఏమన్నా టెంక్షన్ ఉందా ?
జ) అసలు టెంక్షన్ అనేదే లేదు. సినిమా సూపర్ హిట్టైన ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే చిరంజీవిగారు మొదటి సినిమా చూసి కౌగిలించుకున్నప్పుడే అర్థమయిపోయింది సినిమా సూపర్ హిట్టని. అందుకే ఎలాంటి టెంక్షన్ లేదు.

ప్ర) సినిమా ఏమన్నా మార్చారా ?
జ) నేనెప్పుడూ సినిమా కథను మార్చాను. కానీ కథలో చిరంజీవిగారికి కావాల్సిన కామెడీ, పాటలు, డ్యాన్సులు యాడ్ చేశాను.

ప్ర) ‘అఖిల్’ పరాజయం ఈ సినిమాపై ప్రభావం చూపుతుందా ?
జ) ‘అఖిల్’ సినిమా ఫెయిల్యూర్ నన్ను బాగా బాధించింది. అయినా కూడా చిరంజీవిగారు నన్ను నమ్మి ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.

ప్ర) చాలా మంది కత్తి సినిమాని చూశారు. ఈ రీమేక్ నుండి వాళ్ళేం ఆశించవచ్చు ?
జ) ఇంతకు ముందు సినిమా చూసిన వాళ్ళు చిరంజీవిగారు ఈ కథను ఎలా ఓన్ చేసుకున్నారు, ఎలా పెర్ఫార్మ్ చేశారో చూసి ఆశ్చర్యపోతారు. సినిమా చూడని వాళ్ళు కామెడీ, కథలోని హార్డ్ హిట్టింగ్ సీన్లు చూసి థ్రిల్ ఫీలవుతారు.

ప్ర) రీమేక్ ఎంచుకోవడానికి కారణం ?
జ) ఖచ్చితమైన హిట్ సాధించాలనే రీమేక్ ను ఎంచుకున్నాం. ఇప్పటికే విజయం సాధించిన కథ, చిరంజీవిగారి ఇమేజ్ కి సరిపోయే కథ కూడా కాబట్టి రీమేక్ చేయాలని డిసైడయ్యాం.

ప్ర) ఠాగూర్ లో ఉన్నట్టు ఇందులో కూడా ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయా ?
జ) ఉంటాయి. సినిమా క్లైమాక్స్ లో చిరంజీవిగారి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. రైతుల సమస్యల గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి.

ప్ర) చిరంజీవిగారి పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడే అంశాలేమన్నా ఇందులో ఉన్నాయా ?
జ) ఇందులో అసలు రాజకీయం అనే అంశమే ఉండదు. సినిమా అంతా రైతుల సమస్యల మీదే నడుస్తుంటుంది.

ప్ర) ఈ వయసులో చిరంజీవిగారి నటనను ఆడియన్స్ మెచ్చుకుంటారు ?
జ) రేపు సినిమా చూసిన తరువాత మీకు సమాధానం తెలుస్తుంది. నాకు తెలిసి చిరంజీవిగారు కేవలం యంగ్ హీరేవులకే కాదు చాలా మంది సీనియర్ హీరోలకి కూడా స్ఫూర్తిగా నిలిచారు. ఆయన చేసిన నటన, డ్యాన్సులు కల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తాయి.

ప్ర) చరణ్, చిరంజీవి ఇద్దర్నీ డైరెక్ట్ చేశారు కదా. ఎలాంటి తేడా కనబడింది ?
జ) చరణ్ చాలా సిన్సియర్. సెట్స్ కి వచ్చి తన పనేంటో చూసుకుని వెళ్ళిపోతాడు. కానీ చిరంజీవిగారు అలా కాదు సినిమాకి సంబందించిన ప్రతి అంశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు.