‘నెక్స్ట్ నువ్వే’ లో మెలోడీ సాంగ్స్ చేయడం నా అదృష్టం – సాయి కార్తీక్
Published on Oct 15, 2017 3:34 pm IST

హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తిక్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా ఆడియో ఆల్బమ్ లో ఉన్న రెండు పాటలు రెండు మంచి మెలోడీలు అన్న ఆయన ‘నా దృష్టిలో మెలోడీ సాంగ్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి మెలోడీ సాంగ్స్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. ఆ ఛాన్స్ నాకు ‘నెక్స్ట్ నువ్వే’ ద్వారా వచ్చింది. అందులో ముఖ్యంగా అలా మేడ మీద అనే మెలోడీ చాలా బాగా వచ్చింది.

అందులో వీణ వంటి సాంప్రదాయకరమైన సాధనాలు వాడాం. ప్రభాకర్ కొత్త దర్శకుడిలా కాకుండా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు. ఆయనకు ఏం కావాలో దాన్నే తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. ఈ సినిమాలో హర్రర్ జానర్ ఉంటుంది. అందుకోసమే అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. నేను చేసిన మంచి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ట్రెడిషనల్ వాయిద్యాలను మోడరన్ గా ఉపయోగించి చేశాను. నా మ్యూజిక్ పట్ల అందరూ సంతృప్తిగా ఉన్నారు’ అంటూ మరొక సినిమా ‘రాజా ది గ్రేట్’ తో కెరీర్లో నెక్స్ట్ లెవెల్ కు వెళతానని అనుకుంటున్నాను అన్నారు.

 
Like us on Facebook